గ్లామర్ ప్రపంచంలో ఉన్న రూమర్స్ మరేక్కడ వినిపించవని చెప్పవచ్చు.. రోజుకొకరు మీద రూమర్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. అందులో నిజాలేవో అబద్దాలేవో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంటుంది. ఇలాంటి విషయాల వల్ల నటీనటుల సైతం తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది నిజం ఏమిటన్న విషయం ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి వచ్చి సమాధానం చెబితే తప్ప ఆ విషయం బయటపడేందుకు ఆస్కారం ఉండదు.


ఇప్పుడు తాజాగా ప్రముఖ నటి హీరోయిన్ నగ్మా కు బిజెపి ఎంపీ నటుడు రవి కిషన్ మధ్య ఎఫైర్ ఉందని రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన రవి కిషన్ ఎప్పుడు స్పందించలేదు.. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నా సమయంలో రవి కిషన్ కు ఈ ప్రశ్న ఎదురయ్యింది.. అందుకు రవి కిషన్ సమాధానాలు కూడా తెలిపారు. నగ్మా తో తాను ఎక్కువ సినిమా లు చేయటం వల్ల ఇలాంటి రూమర్స్ వచ్చాయని ఆమెతో తాను చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయని దీంతో ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేశారని తెలిపారు..

తామిద్దరం మంచి స్నేహితులమని అందుకే ఎక్కువ సినిమాలు చేసినట్లు తెలిపారు రవి కిషన్. తనకు వివాహమైందని తన భార్య పేరు ప్రీతి శుక్లా అని తాను తన భార్యని ఎంతగానో గౌరవిస్తానని తెలిపారు.ఆమె తన దగ్గర డబ్బులు లేని సమయంలో నుంచి కూడా ఈ స్థాయి వరకు తోడు ఉందని అందుకే ఆమె అంటే తనకు చాలా గౌరవం అని తన సినిమాలు విజయవంతమై తాను సూపర్ స్టార్ అయ్యాక గర్వాన్ని ప్రదర్శించినట్లుగా తెలిపారు.. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత తనకి చాలా మార్పు వచ్చిందని తెలిపారు రవి కిషన్ ఆ తర్వాత తన భార్యను కుటుంబాన్ని తను చాలా బాగా చూసుకుంటున్నానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: