తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యువ నటుడు ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన  సంవత్సరం కిరణ్ ఏకంగా 3 మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో సమ్మతమే మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో కిరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమాకు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో మీటర్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

 రమేష్ కాడురి దర్శకత్వం వహించిన ఈ మూవీ కి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా ఏరియాల థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేసింది. అందులో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే అమ్మివేసింది. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని ఈ సంస్థ ఓవర్సీస్ లో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: