తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ  ప్రారంభం కాక ముందే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా కనిపించనుండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ షూటింగ్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ షూటింగ్లో శ్రీ లీల ఏప్రిల్ 10 వ తేదీ నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 10 వ తేదీ నుండి శ్రీ లీల పై ఈ మూవీ బృందం చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం అందుకున్నటు వంటి తేరి మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందబోతుంది. ఈ మూవీ రీమేక్ కథ తో రూపొందబోతున్నప్పటికీ ఈ సినిమా కథ ... కథనాల విషయంలో అనేక మార్పులు చేర్పులను హరీష్ శంకర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: