
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ 9వ తేదీన లాంఛ్ చేయబోతున్నారు. దీనికోసం ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఒకేసారి అమెరికా కెనడా మిడిల్ ఈస్ట్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రష్యా ఈజిప్ట్ ఇలా అనేక దేశాలలో ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయిన తరువాత విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీనితో ఈమూవీ గ్రాఫిక్స్ వర్క్స్ ను మరింత మెరుగుగా చేయడంకోసం ఈ మూవీ విడుదలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈమూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో విడుదల అవుతున్న ఈమూవీ ట్రైలర్ పై అందరిలోనూ ఆశక్తి విపరీతంగా ఉంది.
ఇప్పుడు ఈ ట్రయిలర్ లాంఛ్ తో ఈసినిమా ప్రచారం తారా స్థాయికి చేరబోతోంది. ఈమూవీ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్స్ లో అనేకమంది ప్రముఖ స్వామీజీలు కూడ అతిధులుగా రాబోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుపతి ఖమ్మంలో కూడ భారీ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించిన విషయం అందరికీ తెలిసిందే. రాముడి గెటప్ పై ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ దర్శకుడు ఓం రౌత్ పట్టించుకోకపోవడం హాట్ న్యూస్ గా మారింది..