అలా అలనాటి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఈ విషయంపై చాలా ఘాటుగానే స్పందించింది.. మనం స్వాతంత్ర సమరయోధులను గౌరవించకపోయిన పరవాలేదు కానీ ఇలా అవమానించకండి అంటూ ఈ పోస్టర్ను చూపిస్తూ క్యాప్షన్ రాసుకుంది.. అంతేకాకుండా భగత్ సింగ్ పేరుని కాల దగ్గర పెట్టడమేంటి ఇది అహంకారమా? లేకపోతే అజ్ఞానమ అంటూ తన ట్విట్టర్ నుంచి షేర్ చేసింది. ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈ విషయం పైన స్పందించడం జరిగింది.
పూనమ్ కౌర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ పాదాల కింద భగత్ సింగ్ పేరును ఉంచినందుకు డైరెక్టర్ హరిశంకర్ మరియు డిజైనర్లను సైతం ఖండించడం జరిగింది. ఆ తర్వాత కొత్త పోస్టర్లలో టీం ఈ విషయం పైన కాస్త శ్రద్ధ పెట్టి మరి..ఉస్తాద్ భగత్ సింగ్ పేరున పైన ఉంచడం జరిగింది. పూనమ్ కౌర్ ఇలా స్పందించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. పూనమ్ కౌర్ పైన పవన అభిమానులు కూడా కాస్త ఆగ్రహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది మాత్రం పూనమ్ కు సపోర్టుగా నిలుస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత మరి ఎలాంటి ఇబ్బందులను ఇంకా ఎదుర్కొంటుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి