రీసెంట్గా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న OG చిత్రం మాత్రం ప్రస్తుతం యమ స్పీడుగా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా డేట్ ల కోసం పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం మీద పవన్ కళ్యాణ్ తో పాటు అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల అవుతున్న పోస్టర్స్.. గ్లింప్స్ కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు OG సినిమా విడుదలయ్య అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా VFX వర్క్ కారణం చేత హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. OG చిత్ర బృందం డిసెంబర్ చివరి కల్లా ఈ సినిమాని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాదిలోపు ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు చిత్ర బృందం. మరిఎ మేరకు ఏ సినిమా పవన్ కళ్యాణ్ ముందు విడుదల చేస్తారు చూడాలి మరి. ఇవే కాకుండా ప్రస్తుత సముద్రఖని దర్శకత్వంలో ఒక సినిమా కూడ నటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ఇటీవల కాలంలో మొదలు కావడం జరిగింది. ఈ సినిమాకి టైటిల్ బ్రో అని కూడా తెలిపారు.