
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ బ్యానర్ పైన.. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి పలు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.. అయితే ఇదంతా బాగానే ఉన్నా డైరెక్టర్ సుజిత్ తో కలిసి తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రాన్ని ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని పలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మైత్రి మూవీ సంస్థ సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న సినిమాతో చాలా డైలమాలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఒకో చిత్రానికి దాదాపుగా రూ .40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఐదు చిత్రాలను కూడా శరవేగంగా షూటింగ్ చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. ఇప్పటివరకు అయితే ఇందులో కొన్ని సినిమాలు సగం షూటింగ్ వరకు పూర్తి చేసుకోగా మిగిలిన భాగాన్ని ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని పలు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈ ఏడాది చివరి నుంచి వచ్చే ఏడాది వరుసగా సినిమాలను విడుదల చేయాలని ప్లాన్లు పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమా చారం.