సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మే 31 వ తేదీ చాలా స్పెషల్..ఎందుకంటే ప్రతి యేడాది తన తండ్రి దివంగత సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమాకు సంబంధించిన ఏదో ఒక అనౌన్స్‌మెంట్ ఇవ్వడం ఆనవాయితీ వస్తోంది. అయితే.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన తర్వాత వచ్చిన పుట్టినరోజున అభిమానులకు తన సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తున్నట్టు ప్రకటించాడు మహేష్ బాబు.ఇక తాజాగా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తలకు ఎర్రటి బట్ట కట్టుకొని ఎర్రటి చొక్కాకు నల్లని చారలున్న లుక్‌లో కెవ్వు కేక పెట్టేలాగా ఉంది. ఇక బరిలో దిగిన పొట్టేలు గిత్తలా ప్రత్యర్ధులను ఎలా మట్టి కరిపిస్తున్నాడో ఈ పోస్టర్‌లో ఉంది.మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ అయితే చాలా మాసివ్‌గా ఉంది. ఈ ఒక్క పోస్టర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగేలా చేసాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే అంటే పెద్ద పండగే. ఈ రోజు కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు.


ఎందుకంటే మహేష్ బాబు తన దివంగత కృష్ణ పుట్టినరోజున తన సినిమాకు సంబంధించిన అప్‌టేట్ ఇవ్వడం ఆనవాయితీ ప్రతిసారి వస్తోంది. అందుకే ఈసారి కూడా త్రివిక్రమ్‌తో చేయబోతున్న సినిమాకు అదే చేయబోతున్నారు.దీని కోసం త్రివిక్రమ్ తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్‌ను కూడా పక్కన పెట్టాడా అంటే ఔననే సమాచారం తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు సాయంత్రం ప్రకటించనున్నారు.ఐతే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కోసం త్రివిక్రమ్ తన వర్కింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నారట. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన 'అతడు', ఖలేజా సినిమాల విషయంలో కథ ఓకే అయినా కూడా పూర్తి బ్రౌండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం వల్ల ఆయా ప్రాజెక్ట్స్ యేళ్లకు యేళ్లు సాగి చివరకు క్యాస్ట్ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. ఈసారి మాత్రం ఎలా అయిన ఇండస్ట్రీ షేక్ అయ్యే రికార్డులు క్రియేట్ చెయ్యడానికి రెడీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: