ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం లో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమైన చిత్రం అహింస. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మాణం లో రూపొందిన ఈ సినిమా జనవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. తేజ మార్కుగా రూపొందిన ఈ చిత్రం కలెక్షన్లు ఎంత దారుణం గా ఉన్నాయో ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాను సురేష్ డిస్ట్రిబ్యూషన్, దర్శకుడు తేజ సొంతం గా రిలీజ్ చేసిన సంగతి విదితమే. కాగా సుమారు 15 కోట్ల వ్యయంతో తీసిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను 7 కోట్ల రూపాయలు వ్యాల్యూతో అమ్మారు.

దాంతో భారీ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కాగా బక్షాఫీస్ వద్ద సినిమా కలెక్షన్లు కుదేలయ్యాయి. ప్రేమ కథకు యాక్షన్ జోడించి సినిమాలను రూపొందించే తేజ తన మార్కు తోనే అహింసను రూపొందించినప్పటికీ సినిమా ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేదని టాక్. అహింస చిత్రం తొలి రోజు 30 లక్షల రూపాయల తో ఒపెనింగ్స్ ప్రారంభించి, రెండో రోజు 29 లక్షలతో సరిపెట్టుకొంది. ఇక మూడో రోజు అహింస రెండు రోజుల కంటే బెటర్‌గా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అనుకున్నారు.

అయినా, ఆ అంచనాని అందుకోలేదని ట్రేడ్ వర్గాల అంచనా. ఏది ఏమైనా ఈ చిత్రం తొలి వారాంతానికి 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయం దేవుడికెరుక గానీ, సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం మాకేంటి ఈ అగ్ని పరీక్షరా బాబు? అని పెదవి విరుస్తున్న పరిస్థితి. ఎంతోకొంత హైప్ తో తెరకెక్కిన అహింస సినిమా ప్రేక్షకులను హింస పెట్టే రీతిలో ఉందని కొంతమంది ప్రేక్షకులు అంటున్నారు. ఇక మీరు కూడా సినిమా చూసినట్టైతే మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: