టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తాజాగా తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. జూన్ 3వ తేదీన జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ కి రక్షితతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శర్వానంద్ రక్షిత ని వివాహం చేసుకున్నాడు. ఇక వీరి పెళ్లికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిధి రావు హైదరి తదితరులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకలో హీరో సిద్ధార్థ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. సోషల్ మీడియాలో ఇప్పటికే శర్వానంద్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. శర్వానంద్ తన సంగీత్ పార్టీలో చిరంజీవి బాస్ పార్టీ సాంగ్కు అదిరిపోయే స్టెప్పులేసిన వీడియో నెట్టింటా తెగ వైరల్ అయింది. 

అయితే ఇప్పుడు ఇదే వేడుకలో తాజాగా హీరో సిద్ధార్థ్ తన టాలెంట్ తో హైలెట్ గా నిలిచాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. శర్వానంద్ పెళ్లిలో లైవ్ కాన్సెర్ట్ జరుగుతుంటే స్టేజ్ పైకి వెళ్లి మరి పాట పాడి పెళ్లికి వచ్చిన అతిధులను అలరించాడు సిద్ధార్థ్. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లిలో లైవ్ కాన్సర్ట్ జరుగుతుండగా సిద్ధార్థ స్టేజ్ పైకి వెళ్లి పాట పాడుతున్న సింగర్ చేతిలో నుంచి మైక్ తీసుకుని ఓయ్ సినిమాలోని టైటిల్ సాంగ్ ని ఎంతో హుషారుగా పాడి అలరించాడు. దీంతో ఈ వీడియోకి నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఓయ్ సినిమాలో ఈ పాటను కూడా సిద్ధార్థ్ పాడాడు. 

కాగా శర్వానంద్, సిద్ధార్థ కలిసి 'మహాసముద్రం' అనే సినిమాలో నటించారు. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఈ మూవీ ని డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అతిథి రావు హైదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే శర్వానంద్, సిద్ధార్థ ల మధ్య ఎంతో మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటినుంచి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. అన్నట్టు సిద్ధార్థ మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో తాజాగా 'టక్కర్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని కనబరిచింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: