యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూ లో తారక్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే మహేష్ బాబు తో చేయాలని ఉందని పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమా ల్లో రీమేక్ చేయాల్సి వస్తే దానవీర శూరకర్ణ మాత్రమే చేస్తానని తారక్ తెలిపారు.

రాజమౌళి, వినయక్, కృష్ణవంశీలలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు ఈ ప్రశ్న చాలా ఛండాలమైన ప్రశ్న అని ఎన్టీఆర్ చెప్పు కొచ్చారు. ఆ డైరెక్టర్లలో ముగ్గురూ ఇష్టమని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని తారక్ అన్నారు. ఆ ప్రశ్నకు ఛాయిస్ లేదని ముగ్గురూ ముఖ్యమని ఆయన వెల్లడించారు. ముగ్గురి తో అద్భుతమైన అనుభవాలు ఉన్నాయని తారక్ పేర్కొన్నారు. నన్ను యాక్టర్ గా ముగ్గురు డైరెక్టర్లు అద్భుతంగా చూపించారని ఆయన తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులతో తారక్ కు మంచి అనుబంధం ఉంది. తారక్ తో ఒకసారి పని చేసిన దర్శకులు మళ్లీ మళ్లీ పని చేయడాని కి ఆసక్తి చూపిస్తారు. లేడీ అభిమానులు నన్ను స్లిమ్ గా చూడాలని కోరుకుంటున్నారని తారక్ అన్నారు. ఆ తరం హీరోయిన్లలో శ్రీదేవి ఇష్టమని ఆయన తెలిపారు. ఫేవరెట్ యాక్టర్ గా సీనియర్ ఎన్టీఆర్ ఇష్టమని ఆయన తెలిపారు.

మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టమని తారక్ కామెంట్లు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ తో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ రేంజ్ ను పెంచేలా బిజినెస్ పరంగా తారక్ మరింత ఎదిగేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: