బడా నిర్మాత దిల్ రాజు ఈమధ్య భారీ సినిమాలను నిర్మించాలనే ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం చరణ్ తో గేం ఛేంజర్ మూవీ చేస్తున్న దిల్ రాజు ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్ మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. విజయ్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత దిల్ రాజు పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా హిట్ సినిమాల సీరీస్ లతో తన డైరెక్షన్ టాలెంట్ చూపిస్తున్న శైలేష్ డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందట.

శైలేష్ కొలను డైరెక్షన్ లో దిల్ రాజు బ్యానర్ లో ఒక పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో ఉంది. ఆల్రెడీ కథ ఫైనల్ అయ్యిందట. ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోని నటింపచేయాలని చూస్తున్నారట. ఒకవేళ వారు అనుకున్న బాలీవుడ్ హీరో చేయనంటే అప్పుడు తెలుగు హీరోని తీసుకుంటారని తెలుస్తుంది. హిట్ సీరీస్ ల కథ కాకుండా శైలేష్ ఈ సినిమాను కొత్త కథతో చేస్తున్నారట.

ఆల్రెడీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్న శైలేష్ నానితో హిట్ 3 చేయాల్సి ఉంది. మరి ఆ సినిమాల సంగతి ఏమో కానీ దిల్ రాజు సినిమా మాత్రం ప్లానింగ్ లో ఉంది. నిర్మాతగా దిల్ రాజు ఈమధ్య వెనక్కి తగినట్టు అనిపించగా తను కూడా వరుస సినిమాలతో వస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో శైలేష్ చేస్తున్న సినిమాలో హీరో ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. గేం ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా దిల్ రాజు సైలెంట్ గా ఉన్నారు. చరణ్ సినిమా కాబట్టి రిలీజ్ టైం లో హడావిడి చేద్దామని డిసైడ్ అయినట్టు ఉన్నారు. ఏది ఏమైనా దిల్ రాజు ప్లాన్ అంటే ఓ రేజ్ లో ఉండాల్సిందే మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: