టాలీవుడ్ లో జయం సినిమాతో అప్పటి యూత్ నుండి మంచి క్రేజ్ హీరో గా పేరు తెచ్చుకున్న మన యూత్యుత్ స్టార్ నితిన్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. ఈయన భీష్మ తర్వాత ఆ రేంజ్ హిట్ కాదు కదా మినిమమ్ హిట్ కూడా అందుకోలేక పోయాడు.మధ్యలో మూడు నాలుగు సినిమాలతో వచ్చిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. మరి అందుకే ఈసారి తనకు బీష్మ వంటి హిట్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తోనే మరో సినిమాకు కమిట్ అయ్యాడు.నితిన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా భీష్మ సినిమా చేసారు. మరి ఈ సినిమాను డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేయగా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ ముగ్గురు కాంబోలోనే మరో సినిమా రాబోతుంది. ''VNRTrio'' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి కూడా ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని ప్రేక్షకులు భావించారు.

ఛలో, భీష్మ ట్రాక్ రికార్డ్ తో వెంకీ ఇదే జోనర్ లో మళ్ళీ ట్రై చేస్తాడు అనుకుంటే ఈసారి కాస్త భిన్నంగా ట్రై చేయనున్నట్టు తెలుస్తుంది. ఈసారి వీరి జర్నీ కాస్త భిన్నంగా అడ్వెంచరస్ గా సాగుతుందట.. ఫన్ మాత్రమే కాదు అడ్వెంచరస్ కూడా అని తెలియడంతో ఈ సినిమాపై మరిన్ని హోప్స్ పెరిగిపోయాయి.. ఫన్ అండ్ అడ్వెంచరస్ కాంబో అంటేనే రేర్ కాంబో.ఇలాంటి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. మరి ఈసారి కూడా వెంకీ - నితిన్ కాంబోలో సినిమా అదిరిపోతోంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ కాంబోను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సెట్ చేయగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.. ప్రజెంట్ షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఎప్పటికి టార్గెట్ పెట్టుకున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: