తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మహిళా దర్శకులలో ఒకరు అయినటు వంటి నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకురాలు ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మహిళ దర్శకురాలిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకురాలు సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా అన్ని మంచి శకునంలే అనే మూవీ ని రూపొందించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను అందుకుంది. ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియా లో 81 లక్షల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ లో 23 లక్షలు , యూ ఏ లో 28 లక్షలు , ఈస్ట్ లో 17 లక్షలు , వెస్ట్ లో 13 లక్షలు , గుంటూరు లో 18 లక్షలు , కృష్ణ లో 20 లక్షలు , నెల్లూరు లో 10 లక్షలు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షలు , ఓవర్ సీస్ లో 70 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.95 కోట్ల షేర్ ... 6.30 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 5.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ అండ్ ముగిసే సరికి 2.55 కోట్ల నష్టాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: