ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా హీరోలతో పోల్చి చూస్తే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయినవి చాలా తక్కువే. కానీ హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అంతకంతకు అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు పవర్ స్టార్. ఇక పవర్ స్టార్ కి అభిమానులు కాదు అందరూ విరాభిమానులే ఉన్నారు అనడంలో సందేహం లేదు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారు సైతం ఇక పవర్ స్టార్ ని ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు.


 ఇకపోతే ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా మారిన.. లేదంటే అదృష్టం కలిసి వచ్చి సీఎం గా మారినా కూడా సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. దీంతో ఇక పవన్ కళ్యాణ్ స్థానాన్ని అఖీరానందన్ తో భర్తీ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు  ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అకీరా సినిమా ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.


 కాగా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల తనయుడు అఖీరా నందన్ ఇక ఇతివలె వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో తెలుగు పాటలు వింటూ కనిపిస్తున్నాడు అకిరా నందన్. తెలుగు పాటలు ప్లే చేయాలని అడిగినప్పుడల్లా నన్ను పిచ్చిదానిలా చూసేవారు. కానీ వాటిని నేను పట్టించుకోను. వర్కౌట్లు  చేసేటప్పుడు అర్థం పర్థం లేని ఇంగ్లీష్ సాంగ్స్ కు బదులు మాతృభాషలోని పాటలను వినమంటూ అఖిరాను ప్రోత్సహించేదాన్ని.. ఈ కాలం యువత కూడా మాతృభాషను గౌరవించి ఇదే విధంగా చేస్తారని అనుకుంటున్నా అంటూ రేణు దేశాయ్ కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: