యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలోతెరకెక్కుతున్న మూవీ 'దేవర'.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ను ఇప్పటికే మేకర్స్ ఫిక్స్ చేసారు.ఐతే ఈ సినిమాలో అతిలోసుందరి, కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. ఈమె మెయిన్ హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉందని టాక్..అందుకు కొరటాల అండ్ టీమ్ తెగ సర్చింగ్ చేస్తున్నారట. మరో హీరోయిన్ గా ఎవరైతే బాగుంటారు అని వెతుకులాటలో ఉన్నారు. ఎప్పటి నుండి ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ ను తీసుకోనున్నట్టు వార్తలు రాగా ఈ రోజు మరోసారి ,రూమర్స్,వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించగా ఇప్పుడు మళ్ళీ ముందుగా వినిపించిన సాయి పల్లవి పేరునే వినిపిస్తుంది.

ఈ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకుంటున్నట్టు టాక్.. చూడాలి చివరకు కొరటాల ఏం చేస్తాడో.. ఇక పవర్ ఫుల్ స్టోరీతోనే ఎన్టీఆర్ తో కొరటాల సినిమా తెరకెక్కిస్తున్నాడు అని ఫస్ట్ లుక్ తోనే తేలిపోయింది. అందుకే తారక్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ లెన్తీ షెడ్యూల్ ప్లాన్ చేసి షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని కొరటాల ఆలోచన.ఇక ఈ సినిమాలో విలన్ రోల్ ను బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పోషిస్తుండగా.. యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.ఐతే ఈ మూవీ మీద భారీ స్థాయిలో అభిమానులు హిట్ కొడుతుందని ఆశిస్తున్నారు. అలాగే కొరటాల కూడా గత సినిమా ప్లాప్ కారణంగా ఈ మూవీ మీద మంచి ఫోకస్ పెట్టి సీన్ టూ సీన్ చాలా జాగ్రత్తగా తెరకేక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: