యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సూపర్ హిట్లతో జోరు చూపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అందరిలాగా కమర్షియల్ సినిమాల వెంట పడకుండా.. ప్రేక్షకులను మెప్పించే బలమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యమైన సినిమాలతో సూపర్ హిట్లను అందుకుంటున్నాడు. దీంతో ఇక నిఖిల్ ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఆ కథలో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తూ థియేటర్లకు వచ్చేలా అతను సినిమాలతో ప్రభావితం చేస్తున్నాడు. కాగా గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో హవా నడిపించిన నిఖిల్.. ఇక ఇప్పుడు స్పై అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


 నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పాలి. ఈ సినిమాకు బిహెచ్ గ్యారి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. కాగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు నిఖిల్. కాగా తన కెరియర్ గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా స్వామి రారా సినిమా తన కెరీర్ ను ఎలా మలుపు తిప్పిందో గుర్తు చేసుకున్నాడు నిఖిల్. స్వామిరారా సినిమాకి ముందు డిస్కో అనే సినిమా చేశాను. ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో నాపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.


 ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. డిప్రెషన్లో మునిగిపోయాను. రెండు మూడు నెలల పాటు కారులో ఒంటరిగా దేశమంతా తిరిగాను. సినిమాలు హిట్ అవ్వాలంటే పెద్ద డైరెక్టర్, పెద్ద నిర్మాత కాదు మంచి కథ ఉండాలి అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత కొంతమంది స్నేహితులతో కలిసి 2013లో స్వామి రారా అనే చిన్న సినిమా చేశాను. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక నా కెరియర్ అక్కడితో మలుపు తిరిగింది అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ స్వామి రారా సినిమా హిట్ కాకపోయి ఉంటే ఇంకో సినిమా చేసే వాడిని కాదేమో అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. స్వామి రారా సినిమా విజయం తన కెరీర్ కు బూస్ట్ ఇచ్చిందని నిఖిల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: