అయితే సినిమా స్టోరీ బాలేక పోయినప్పటికీ బ్రహ్మానందం కామెడీ ట్రాక్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక దర్శకుల అయితే సపరేట్గా బ్రహ్మానందం కోసమే కామెడీ traak రాసిన రోజులు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఇక గతంలో స్టార్ హీరోల డేట్స్ కోసం పోటీ పడినట్లుగానే బ్రహ్మానందం ను తమ సినిమాలో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు డేట్స్ కోసం చాలా రోజులపాటు వేచి చూసి సినిమాలను వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి కమెడియన్ బ్రహ్మానందాన్ని ఈ తరం దర్శకులు మాత్రం ఎందుకో పట్టించుకోవట్లేదు.
అయితే బ్రహ్మానందాన్ని సినిమాలో పెట్టుకుంటే కచ్చితంగా ప్లస్ అవుతుందని సగటు ప్రేక్షకుడు బల్లగుద్ది మరి చెప్పగలరడు. ఆయన కామెడీ ట్రాక్ ఉంటే సినిమాకు హిట్ టాక్ వస్తుందని అందరి భావన. కానీ బ్రహ్మితో సినిమాలు చేయడానికి మాత్రం అటు దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదు. నేటి జనరేషన్ కమెడియన్స్ నే తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పాలి. అయితే అందరూ దర్శకులు ఇలా బ్రహ్మానందాన్ని పక్కన పెడుతున్నప్పటికీ.. ఇక బ్రహ్మానందం క్రేజ్ ఏంటో తెలిసిన దర్శకుడు మాత్రం ఇప్పుడు కీడా కోలా అనే సినిమాతో మరోసారి బ్రహ్మానందం కామెడీని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.
ఈ సినిమాలో బ్రహ్మానందమే ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో ఇక థియేటర్కు వెళ్లే ప్రేక్షకులు అందరూ కడుపుబ్బ నవ్వుకోవడం ఖాయం అన్నది తెలుస్తుంది. అయితే తరుణ్ భాస్కర్ ను చూసైనా మిగతా దర్శకులు ప్రేరణ పొంది లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందానికి ఇక అభిమానులను ఇంకొంతకాలం నవ్వించే అవకాశాన్ని ఇస్తారేమో చూడాలి. అయితే భారీగా రెమ్యూనరేషన్ ఉండడం కారణంగానే బ్రహ్మానందాన్ని సినిమాల్లోకి తీసుకోవడానికి ఇక కొంతమంది యువ దర్శకులు ఆసక్తి చూపడం లేదని.. ఇక బ్రహ్మానందం కు సరితూగే పాత్రలు లేకపోవడంతోనే ఆయనను సంప్రదించడం లేదంటూ కొన్ని కాసిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి