తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ కలిగిన దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈ దర్శకుడు పెళ్లి చూపులు అనే మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. చిన్న సినిమాగా పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకొని భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా తరుణ్ భాస్కర్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు ఈ నగరానికి ఏమైంది అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ తో తరుణ్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరింతగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నగరానికి ఏమైంది మూవీ ని థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రిలీజ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయో తెలుసుకుందాం.

రీ రిలీజ్ లో భాగంగా ఈ నగరానికి ఏమైంది సినిమాకు నైజాం ఏరియాలో 81 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలో కలుపుకొని 88 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.69 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకు 9 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా 1.78 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇలా రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: