తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలతో ఒకరు అయినటువంటి నాగశౌర్య తాజాగా రంగబలి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూలై 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఈ సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల షేర్ ... 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 82 లక్షల షేర్ ... 1.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకు రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1.67 కోట్ల షేర్ ... 3.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 6.20 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ మరో 4.53 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినట్లు అయితే ఈ మూవీ క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: