
కానీ ఈ పోస్టర్లో దీపిక లుక్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న మరో మూడు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి పలువురు అప్డేట్ ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్-k చిత్రానికి సంబంధించి టైటిల్ను అంతర్జాతీయ వేదికగా గ్రాండ్గా విడుదల చేయడానికి జులై 19వ తేదీన శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలు జరగబోతున్నాయి.అక్కడే మరుసటి రోజున ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రభాస్ అమితాబచ్చన్, దీపిక పదుకొనే, నిర్మాతలు నాగ్ అశ్విన్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ని కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఈ ప్రకటనతో అభిమానులు చాలా ఆనందంతో మునిగిపోతున్నారు. ప్రభాస్ నటించిన మరొక చిత్రం సలార్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఇటీవల విడుదల కాగా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.ప్రాజెక్ట్-k చిత్రం టైటిల్ కాలచక్రం అనే విధంగా ఉండబోతోందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మరి సినిమా టైటిల్ అయితే బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొనే సంబంధించి ఈ ఫస్ట్ లుక్ వైరల్ గా మారుతోంది.