మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ సినిమా అయిపోయిన వెంటనే సరికొత్త సినిమాని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.. పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ తన కొత్త ప్రాజెక్టుని ప్రకటించడం జరిగింది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా హైదరాబాదులో నిన్నటి రోజున జరిగినట్లు సమాచారం.


ఈ చిత్రానికి టైటిల్ మట్కా అని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మేకర్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరిని ఆసక్తి పరిచయాల కనిపిస్తోంది ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా స్టోరీ కూడా 1975 నేపథ్యంలో సాగే ఒక కథ అంశంతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా అన్ని భాషలలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తుండగా బాలీవుడ్ నటి నారా ఫతేహి కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవ దారి అర్జున నటించిన చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇందులో హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మట్కా సినిమా పోస్టర్ విషయానికి వస్తే.. ఈ పోస్టర్లో ఒక రూపాయి నాణెం మీద కారు ఆ పైన బాక్స్ ఉంచినట్టుగా చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: