రణ్ బీర్ కపూర్ అలియా భట్ లు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి కంటే ముందే రణ్ బీర్ కపూర్ కి చాలామంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉండేవి.అలాగే అలియా భట్ కూడా రణ్ బీర్ కపూర్ కంటే ముందే కొంతమంది హీరోలతో లవ్ ట్రాక్ నడిపించింది.అయితే ఇవి సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ ఎవరూ కూడా పెళ్ళికి ముందు ఉన్న ఎఫైర్స్ ని పట్టించుకోరు. అయితే ఎంతో ప్రేమించుకొని రణ్ బీర్ కపూర్ అలియా భట్ ఇద్దరు ఇంట్లో వాళ్ళని ఒప్పించి 2022 ఏప్రిల్ 14న అంగరంగ వైభవంగా తమ వివాహం చేసుకున్నారు.ఇక వీరి వివాహానికి చాలామంది బంధువులు, సన్నిహితులు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇలా చాలామంది హాజరయ్యారు.

ఇక అలియా భట్ బాలీవుడ్ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఆర్ఆర్ఆర్  సినిమా ద్వారా సుపరిచితమైంది. అయితే అలియా భట్ మూడు రోజుల తేడాతో రెండుసార్లు పెళ్లి చేసుకుంది అంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూ లో సీక్రెట్ ని బయటపెట్టారు. అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ రణ్ బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్నాక మళ్లీ రెండో పెళ్లి అలియాభట్ ఎవరిని చేసుకుంది అంటూ అనుమాన పడుతున్నారు. అయితే అలియా భట్ రెండోసారి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు మళ్ళీ తన భర్త రణ్ బీర్ కపూర్ నే.

ఇక అసలు విషయం ఏమిటంటే.. అలియా భట్ రణ్ బీర్ కపూర్ ల పెళ్లయిన తర్వాత మూడు రోజులకే రణ్ బీర్ ఆలియా కలిసి నటించిన రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహాని అనే సినిమాలో నటించారు.అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా వీరి పెళ్లయిన వారంలోపే మళ్ళీ అలియాభట్ మెడలో రణ్ బీర్ కపూర్ తాళి కట్టే సన్నివేశం ఉంది. ఈ విధంగా పెళ్లైన వారంలోపే వీళ్ళిద్దరూ రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు అని ఎవరికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం గురించి కరణ్ జోహార్  ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: