టాలీవుడ్ లో ఎప్పుడు ఏదో ఒక వివాదం తెర పైకి వస్తూనే ఉంటుంది. కొన్ని కావాలని నిజంగానే జరుగుతున్నప్పటికీ కొన్ని మాత్రం ఏవో అలా రూమర్స్ లాగా తెరపై గెలుస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి వాటిల్లో అనసూయ విజయ్ దేవరకొండ వివాదం కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ వీళ్ళిద్దరి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో కొట్టుకుంటున్నారు. అయితే దానికి ముఖ్య కారణాలు ఇప్పటివరకు సరిగ్గా తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచూ వీరిద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు.

 అయితే ఏదో ఒక సినిమాలో విజయ్ అన్నమాట ను పట్టుకుని అనసూయ కామెంట్ చేయడం వాటికి విజయ్ దేవరకొండ రియాక్ట్ అవ్వడం ఆ తర్వాత విజయ్ తన పేరును ది విజయ్ దేవరకొండ అని మార్చుకోవడం. ఇక దాన్ని కూడా వివాదం లాగా మార్చేస్తూ అనసూయ కామెంట్ చేయడం ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో విజయ్ అనసూయ వివాదం గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే సోషల్ మీడియాలో ఎక్కడ ఎప్పుడు చూసినా అనసూయ విజయల మధ్య కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది

ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న ఎదురవడంతో దానికి సమాధానం ఇచ్చాడు విజయ్. ఆ విషయం గొడవ పడే వాళ్ళని అడగాలి ఎందుకు గొడవ పడుతున్నారో ఏమో అక్కడ ఏమి నడుస్తుందో నాకు అసలు తెలియదు అంటూ చాలా కూల్ గా ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు విజయ్. ఇక అదే సమయంలో మరో ప్రశ్నకు సమాధానంగా నేను ఎప్పుడూ కాంట్రవర్సీలో కావాలని కోరుకోను .. అలాంటివి వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో అని మాత్రమే ఆలోచిస్తాను అంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు విజయ్. అయితే నిజానికి విజయ్ మరియు అనసూయ వివాదంలో నేరుగా విజయ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు.. కేవలం ఆయన ఫ్యాన్స్ మరియు అనసూయ మధ్యనే ఈ వివాదం జరుగుతూ ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: