చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ అనే మూవీ ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు విడుదల ఆయన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్ లనే రాబట్టింది. మరి ఈ సినిమా విడుదల అయిన ఫస్ట్ డే నాడు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది అనే విషయాలను తెలుసుకుందాం.

సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 4.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ... సిడెడ్ ఏరియాలో 2.02 కోట్లు ... యుఏ లో 1.84 కోట్లు ... ఈస్ట్ లో 1.32 కోట్లు ... వెస్ట్ లో 1.85 కోట్లు ... గుంటూరు లో 2.08 కోట్లు ... కృష్ణ లో 1.03 కోట్లు ... నెల్లూరు లో 73 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే మొత్తంగా ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.38 కోట్ల షేర్ ... 22.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా విడుదల అయిన మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా ... కీర్తి సురేష్ ... సుశాంత్మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించగా ... మహతీ స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: