టాలీవుడ్ సీనియర్ స్టార్ కింగ్, మన్మధుడు నాగార్జున పుట్టినరోజు నేడు. ఆయనకి 64 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అంతే అందంగా, ఆరోగ్యంగా ఉంటూ, పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.ఇక ఇప్పటికే మొత్తం 98 సినిమాలతో హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఎంతగానో మెప్పించిన నాగ్ వందకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాడు.అక్కినేని నాగార్జున గత సంవత్సరం ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. అయితే ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అప్పట్నుంచి నాగ్ తన నెక్స్ట్ సినిమాని ఎప్పుడు అనౌన్స్ చేస్తాడా అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు.నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా నాగ్ 99వ సినిమాని ప్రకటించడం జరిగింది.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నాగార్జున 99వ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.


ఇప్పటికే నాగ్ తన కెరీర్ లో ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ ని ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమాతో మరో కొత్త డైరెక్టర్ ని కూడా పరిచయం చేస్తున్నాడు. విజయ్ బిన్నీ అనే కొత్త దర్శకుడు నాగార్జున 99వ సినిమాని చాలా భారీగా తెరకెక్కిస్తున్నాడు.అందులో భాగంగా తాజాగా నేడు 'నా సామిరంగ' అనే సరికొత్త సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్. ఇంకా అలాగే టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ గ్లింప్స్ లో నాగార్జున ని లుంగీ కట్టించి, బీడీ కాలుస్తూ మాస్ రోల్ లో చూపించారు. ఈ పండక్కి నా సామిరంగ అంటూ కింగ్ నాగార్జున సూపర్ గా అదరగొట్టారు. ఇన్నాళ్లు ఎలాంటి అప్డేట్ లేకుండా నేడు డైరెక్ట్ గా వచ్చి సంక్రాంతి బరిలో దిగాడు కింగ్ నాగ్. దీంతో అక్కినేని ఫ్యామిలీ అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాతో నాగార్జున ఖచ్చితంగా కం బ్యాక్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: