అక్కినేని నాగార్జున ,అమల దంపతుల దాంపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటగా ఉంటారు.. ఇంట్లో ఎలా ఉంటారో అభిమానులు మధ్యలోకి వచ్చినా కూడా అలాగే సరదాగా ఉంటారు.. ఎప్పుడూ కూడా ఒకరిపై మరొకరు జోకులేసుకుంటూ నవ్విస్తూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా కూడా పేరుపొందారు ఇద్దరు కలిసి చేసింది కొన్ని సినిమాలు ఆయన ఆ సినిమాలు మంచి క్లాసికల్ హిట్ ని అందుకున్నాయి.


తాజాగా అమల ,నాగార్జున నటించిన హిట్ మూవీ హలో బ్రదర్ లో సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్పులు వేయడం జరిగింది. అమల 20 ఏళ్ల వయసులో డాన్స్ చేసినట్టే ఈ వీడియోలో కనిపిస్తోంది. వయసు పెరిగిన కూడా ఆమె డాన్స్ లో మాత్రం ఎనర్జీ గ్రేస్ మాత్రం తగ్గలేదు.. అమలా వేసిన ప్రతి మూమెంట్ కూడా ఎంతో ఎనర్జీ తో వేసినట్టుగా కనిపిస్తోంది.. తనదైన స్టైల్ లో సిగ్నేచర్ స్టెప్పులతో అక్కినేని అభిమానులను సైతం ఆనందంతో ముంచేత్తుతోంది అమల. ఈ వీడియో చూస్తే నాగార్జున గుండెల్లో కూడా గంటలు మోగడం ఖాయమంటూ పలువురు అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు.

అన్నపూర్ణ ఫిలిమ్స్ కాలేజీలో జరిగిన ఒక వేడుకలలో భాగంగా డాన్స్ తో అలరించింది అమల.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది ..అమలా డాన్స్ తో మరొకసారి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. నేటితరం యువత ఈ వీడియో చూసి అమల గొప్ప డాన్సర్ అంటూ కూడా ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు.. అమల బేసిక్ గాని మంచి నాట్యకారిని చిన్న వయసునుండే తనకు నాట్యం అంటే చాలా ఇష్టం ఉండేదట.. ఒక ప్రత్యేక కళాక్షేత్రం తరపున దేశంలో చాలా చోట్ల కూడా అమల తన నాట్య ప్రదర్శన చేసినట్లు సమాచారం. ఇతర దేశాలలో కూడా తన ప్రతిభని చాటింది అమల.

మరింత సమాచారం తెలుసుకోండి: