ఈవారం విడుదల కాబోతున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  సినిమా పై నవీన్ పోలిశెట్టి చాల ఆశలు పెట్టుకున్నాడు. ‘జాతిరత్నాలు’ మూవీ తరువాత విడుదలకాబోతున్న మూవీ కావడంతో ఈమూవీ తనకు బ్లాక్ బష్టర్ హిట్ ఇస్తుందని నవీన్ ఆశిస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే ఈమూవీ ఆన్ లైన్ ప్రమోషన్ ను రామ్ చరణ్ కూడ చేస్తూ ఉండటంతో ఈమూవీ హిట్ అవుతుందని అంచనాలు వస్తున్నాయి.



గతవారం విడుదలైన ‘ఖుషీ’ మూవీకి టాక్ బాగా వచ్చినప్పటికీ మొదటి మూడు రోజుల తరువాత ఈమూవీ కలక్షన్స్ భారీగా డ్రాప్ అవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆశక్తి అంతా ఈమూవీ పై ఉంది. అయితే ఈమూవీ ఏకంగా షారూఖ్ ఖాన్ ‘జవాన్’ తో పోటీ పడుతూ ఉండటంతో అలాంటి భారీ సినిమాను తట్టుకుని ఎంతవరకు ఈసినిమా కలక్షన్స్ విషయంలో నిలబడుతుంది అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి.



ఈమూవీని ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న నవీన్ పోలిశెట్టి ఈమూవీ టైటిల్ కు సంబంధించిన సీక్రెట్ బయట పెట్టాడు. తమ సినిమా త్వరలో మొదలుపెట్టబోతున్నట్లు గత సంవత్సరం న్యూస్ బయటకు రాగానే కొందరు మీడియా వర్గాలు ఈన్యూస్ ను కవర్ చేస్తూ ‘శెట్టి తో పోలిశెట్టి’ అన్న టైటిల్ పెట్టడంతో ఆ టైటిల్ స్పూర్తితో తాము తమ సినిమాకు ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ అన్న టైటిల్ ఫిక్స్ చేసిన విషయాన్ని బయట పెట్టాడు.



ఇక ఈసినిమాలో నటిస్తున్న అనుష్క లాంటి మంచి మనసు ఉన్న హీరోయిన్ ను తాను ఇన్ని సంవత్సరాలలో ఎక్కడా చూడలేదని అంటూ ఆమె షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు ఆమె ఎదురుగా నుంచుని ఆమె వైపు చూస్తూ తాను డైలాగ్స్ చెప్పడానికి తాను ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆమె తనను ఎంతగానో ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. లండన్ లోని ఒక ప్రముఖ కాలేజీలో చదివి అదే లండన్ లో లక్షల జీతం ఇచ్చే ప్రముఖ కంపెనీలోని ఉద్యోగాన్ని వదులుకుని తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తనను చలామంది అదొరకంగా చూసిన చూపులు తనకు జీవితాంతం గుర్తు ఉంటాయి అని అంటున్నాడు..




మరింత సమాచారం తెలుసుకోండి: