సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం జైలర్ ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చాలాకాలం తర్వాత సాలిడ్ హిట్టుతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాలని చెప్పవచ్చు రజినీకాంత్. రోబో సినిమా తర్వాత మళ్లీ అంతటి సక్సెస్ను అందుకోలేకపోయారు ప్రస్తుతం జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సాధించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వహించారు. ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా రూ .700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవరితో సినిమా చేస్తారు అనే విషయంపై చాలా ఆతృతగా ఉండేవారు అభిమానులు.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అప్డేట్ రానే వచ్చేసింది.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.. విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన డైరెక్టర్ లోకేష్ కనకరాజు ప్రస్తుతం విజయ్ దళపతి తో లియో సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతోంది ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.. సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నారు.


తాజాగా లోకేష్ తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ తో అంటూ ప్రకటించడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ప్రి లుక్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. తలైవా 171 అంటూ పోస్టర్ని సైతం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కళానిధి మారని  నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు  మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ సంగీతాన్ని అందించడం జరుగుతోంది. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి.. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను మెప్పించే లాగా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: