టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ నటుడు తాజాగా స్కంద అనే సినిమాలో హీరోగా నటించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ నెల 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇకపోతే ఈ మూవీ చివరి దశలో ఉన్న సమయం లోనే రామ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని కూడా ఓకే చేశాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ మూవీ ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఈస్మార్ట్ శంకర్ మూవీ మంచి విజయం సాధించడంతో డబల్ ఈస్మార్ట్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ లో రామ్ సరసన హీరోయిన్ గా నటించే ముద్దు గుమ్మ గురించి మాత్రం చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇకపోతే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ క్రేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ లలో సారా అలీ ఖాన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తన అంద చందాలతో ఎంతో మంది కుర్రకారు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే ఈ నటిని డబల్ ఈస్మార్ట్ మూవీ లో హీరోయిన్ గా తీసుకుని ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందులో భాగంగా ఈ నటితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: