‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ విడుదలై సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఆ రేంజ్ మాస్ కమర్షియల్ హిట్ రామ్ కు రాలేదు. దీనితో మాస్ సినిమాలు తీయడంలో చేయి తిరిగిన బోయపాటి శ్రీను సమర్థతను నమ్ముకుని రామ్ లేటెస్ట్ గా నటించిన ‘స్కంద’ మూవీ ఈ నెలాఖరులో విడుదల కాబోతోంది.

వాస్తవానికి ఈసినిమాను వినాయకచవితి ముందు విడుదల చేయాలని భావించారు. అయితే అనుకోకుండా ప్రభాస్ ‘సలార్’ వాయిదా పడటంతో ‘సలార్’ డేట్ ‘స్కంద’ కు దక్కడంతో ఈ నెలాఖరున పాన్ ఇండియా మూవీగా ఈమూవీని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న శ్రీలీల లక్కీ లెగ్ కూడ తనకు కలిసి వస్తుందని రామ్ భావిస్తున్నాడు.

‘అఖండ’ మూవీ తరువాత బోయపాటి నుండి వస్తున్న మూవీ కావడంతో ఈమూవీ బిజినెస్ ఏకంగా 80 కోట్ల స్థాయిలో జరిగినది అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. రామ్ లాంతటి మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ బయ్యర్లు లాభ పడాలి అంటే కనీసం ఈమూవీకి 100 కోట్ల కలక్షన్స్ వచ్చి తీరవలసిన పరిస్థితులలో ఆ రేంజ్ రామ్ కు ఉందా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు.

ఇప్పటివరకు బోయపాటి సినిమాల ట్రాక్ ను పరిశీలించిన వారు వేరొక విధంగా కామెంట్ చేస్తున్నారు. బోయపాటి బాలకృష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన రేంజ్ సూపర్ హిట్స్ బోయపాటి మరో హీరోకి ఇవ్వలేకపోయాడు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఊర మాస్ పాత్రలో రామ్ నటించిన ‘స్కంద’ మూవీ ఫలితం రామ్ కెరియర్ కు అత్యంత కీలకంగ మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సగటు ప్రేక్షకుడు ఈమూవీ పై ఎలాంటి తీర్పు ఇస్తాడు అన్న ఆశక్తి అందరిలోను ఉంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: