ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఆఖరుగా ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. లింగు సామి అనే తమిళ దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఒకే సారి తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ కలేక పోయింది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ డాక్టర్ ... పోలీస్ పాత్రలలో నటించి తన నటనతో మాత్రం ప్రేక్షకులను భాగానే ఆకట్టుకున్నాడు.

ఇకపోతే ది వారియర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ ను అందుకున్న రామ్ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు.  ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ యొక్క నార్త్ ఇండియా థియేటర్ హక్కులను జీ స్టూడియో సంస్థ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క "యూఎస్" హక్కులను ఓ ప్రముఖ సంస్థ 1.5 కోట్ల ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: