టాలీవుడ్ డైరెక్టర్ లలో ఒకరైన హరీష్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరియర్ మొదట్లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి ఇండస్ట్రియల్ హిట్ అనుకున్నాడు. ఆ సినిమాతో దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పవర్ స్టార్ కి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆయన ఫ్యాన్స్ కి దేవుడు అయిపోయాడు. ఇక 'గబ్బర్ సింగ్' తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఇన్నేళ్ల తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఇదిలా ఉంటే హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగాసోషల్ మీడియాలో  నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయానికి స్పందిస్తూ ఉంటారు. ప్రతి సినిమా గురించి పోస్ట్ చేస్తారు. అయితే సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ని విమర్శించే వాళ్ళు, తిట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికే కొంతమంది నెటిజన్లు హరీష్ శంకర్ ని బూతులు తిడుతూ మరి పోస్ట్ చేస్తుండటంతో ఆ మధ్య అలాంటి వాళ్ళని బ్లాక్ చేశాడు. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తేరి మూవీకి రీమేక్ అని వార్తలు వచ్చినప్పుడు రీమేక్ వద్దని పవన్ ఫ్యాన్స్ కొంతమంది హరీష్ ని బూతులు తిడుతూ ట్యాగ్ చేసి పోస్ట్   చేయడంతో వాళ్ళని కూడా బ్లాక్ చేశాడు. 

 ఈ నేపథ్యంలోనే తాజాగా హరిష్ శంకర్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బూతులు పెడుతున్నాడని, చాలా రోజుల నుండి ఈ ఫేక్ అకౌంట్ ద్వారా తనను టార్గెట్ చేసిన వాళ్లపై బూతులు తిడుతున్నాడని, ఆ విషయం ఇప్పుడు రివీల్ అయిందని ఓ మీడియా సంస్థ పోస్ట్  చేసింది. ఆ పోస్ట్  పై హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు." ఎక్స్ క్యూజ్ మీ.. నేను ఎవరికీ భయపడను సార్. అనాలనుకున్నప్పుడు నా అకౌంట్ లోనే పోస్ట్ చేస్తా, ఇంకో అకౌంట్ నాకు అక్కర్లేదు. వాళ్లు నన్ను సమర్థించినా నేను పరుష పదజాలాన్ని ప్రోత్సహించను. దయచేసి ఇలాంటి అర్థం లేని మాటలు ఆపండి. ఇలాంటి విషయాల్లో మీ మద్దతు నాకు అవసరం లేదు" అంటూ తన పోస్ట్  లో రాస్కొచ్చారు. దీంతో హరీష్ శంకర్ చేసిన ఈ పోస్ట్  నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: