
ఇక ఇప్పుడు ఓ కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ టాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది. కొలివిడ్ హీరో కవీన్ అంటే దాదాపు ఎవరు గుర్తుపట్టరు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అతను ఇండస్ట్రీలో ఒక్కో అడుగు ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక అతను నటించిన దాదా మూవీ ద్వారా ప్రేక్షకులు అందరినీ కూడా ఫిదా చేసేసాడు అని చెప్పాలి. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన దాదా సినిమా.. తమిళంలో భారీ హీట్ అందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళంలో కోట్లు కొల్లగొట్టింది.
నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఏకంగా 20 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ అయింది అని చెప్పాలి ఈ క్రమంలోనే కవిన్ పేరు చెప్పడం కంటే దాదా మూవీ హీరో అనగానే అందరూ గుర్తుపడతారు. అయితే కేవలం వెండితెరపై మాత్రమే కాదు ఓటీటిలో కూడా విడుదలై భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. పాపా పేరుతో డబ్ చేయబోతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీ ని ఎం ఎస్ రెడ్డి, శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు నిర్మిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారట.