
ఇలా జబర్దస్త్ షోలో పాపులారిటీ సంపాదించుకొని.. వెండి తెరపై హీరోగా పరిచయం అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. ఇక ఇప్పుడు మరో కమెడియన్ కూడా ఇలాగే వెండి తెరపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. జబర్దస్త్ షోలో ముక్కు అవినాష్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా దగ్గర అయ్యాడు అవినాష్. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో లేకపోయినప్పటికీ మాటీవీలో మాత్రం వివిధ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే డెక్కన్ డ్రీమ్స్ వర్క్ బ్యానర్ పై నభిషేక్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ త్రీ గా రూపొందుతున్న ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అనే సినిమాతో హీరోగా అవతారం ఎత్తబోతున్నాడు ముక్కు అవినాష్.
గతంలో కొన్ని సినిమాలకు రచయితగా వ్యవహరించిన రాకేష్ దుబాసి.. ఇక ముక్కు అవినాష్ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడట. అయితే ఈ సినిమాలో సాయికుమార్ మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా మొదలైంది. ఇక ఈ కార్యక్రమంలో అవినాష్ మాట్లాడుతూ నిర్మాత అభిషేక్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. మరి హీరోగా అవినాష్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు అన్నది చూడాలి మరి.