
డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ తెలుపుతూ డ్రగ్స్ కేసులో సిపి సివి ఆనంద్ ఎస్పి సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తుందంటూ తెలియజేశారు. విచారణలో భాగంగానే నార్కోటిక్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను క్లియర్గా సమాధానాన్ని తెలియజేసినట్లు తెలిపారు. రిమోట్ లింకును ఇన్వెస్ట్ చేసి క్యూస్షన్స్ ని అడిగారని తెలిపారు. గతంలో బిపిఎం అనే పబ్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉండడం అలాగే తన పేరు సీట్ ఈడీలో వినపడటం వల్ల ఇప్పుడు తనని పిలిచి ప్రశ్నలు వేశారంటూ తెలిపారు నవదీప్.
వాళ్లు చక్కగా పనిచేస్తున్నారు దర్యాప్తును బాగా లోతుగా వెళ్లి మరి చేస్తున్నారని పాన్ ఇండియా లెవెల్లో మంచి నార్కోటిక్ బ్యూరో టిన్ ఇది అంటూ తెలియజేశారు ఏడేళ్ల క్రితం పాత ఫోన్ రికార్డును సైతం పరిశీలించి మరి ప్రశ్నలు అడుగుతున్నారని నేను వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని నిందితుడిగా ఉన్న రామచందర్ అనే వ్యక్తి తెలుసు అంతే నాకు అంతకుమించి ఎలాంటి పరిచయాలు లేవంటూ తెలియజేశారు నవదీప్.. అవసరమనుకుంటే అధికారులు పిలిస్తే మళ్లీ వస్తానని కూడా తెలియజేశారు. మీడియా ప్రతినిధులు ఎలాంటి విషయాన్ని అయినా సరే పక్కాగా తెలుసుకొని రాయండి అంటూ సూచించారు. ఈ విషయంపై తనను పరారీలో ఉన్నట్లుగా చూపించారని తెలిపారు.