రాఘవ లారెన్స్ హీరోగా కంగానా రానోత్ కీలక పాత్రలో పి వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ దర్శకుడుగా గుర్తింపును సంపాదించకుండా ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను మొదట ఈ మూవీ బృందం వారు సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఆ తర్వాత ఈ మూవీ.ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొంత కాలం క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కూడా అద్భుతమైన రీతిలో ఉంది. ముఖ్యంగా ఈ మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ను గమనిస్తే ఈ మూవీ లో చాలా గ్రాఫిక్స్ సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నయన తార హీరోయిన్ గా ప్రభు , జ్యోతిక ప్రధాన పాత్రలో పి వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన చంద్రముఖి 2 మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: