మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన 2007 వ సంవత్సరం విడుదల అయినటువంటి చిరుత సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా 2007 వ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తోనే నటుడిగా చరణ్ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇకపోతే ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... నేహా శర్మమూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించగా ... అషిస్ విద్యార్థి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ నెల సెప్టెంబర్ 27 వ తేదీ తో రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 16 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దీనితో ఆయన అభిమానులు రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో ఒకటి అయినటు వంటి రంగస్థలం సినిమాని కొన్ని ఏరియాల్లో ప్రత్యేక షో లను ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఆ ఏరియాలో ఏమిటో కూడా ఓ పోస్టర్ ద్వారా విడుదల తెలియజేశారు. 

రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 16 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రంగస్థలం మూవీ ని శ్రీకాకుళం , విజయనగరం , వైజాగ్న్, రాజమండ్రి , నెల్లూరు , అనంతపూర్ , హైదరాబాద్ నగరాల్లోని కొన్ని థియేటర్ లలో ప్రత్యేక షో లు వెయ్యనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకు మొదటి రిలీజ్ లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. మరి ఈ మూవీ కి ప్రత్యేక స్క్రీనింగ్ లో ఎలాంటి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: