ఉస్తాద్ హీరో రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా స్కంద. సెప్టెంబర్ 28న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. రిలీస్ సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ని శరవేగంగా జరుపుకున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే రామ్ తాజాగా స్కంద హిందీ ప్రమోషన్స్ కి హాజరయ్యారు. ఈ ప్రమోషన్ లో రామ్ షారుక్, సల్మాన్ ఖాన్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్ కి తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తే వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే రామ్ కి హిందీలో డబ్బింగ్ చెప్పే సంకేత్ మాత్రే స్కంద ప్రమోషన్స్ లో భాగంగా  ఇంటర్వ్యూ చేశాడు. 

ఈ ఇంటర్వ్యూలో సంకేత్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు రామ్. మీ ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఇది? ఎలా అనిపిస్తుంది? అని అడగగా.." చాలామంది రిలీజ్ గురించి అడుగుతున్నారు. ఇది బాలీవుడ్ సినిమా అంటున్నారు. ఒకటి చెప్పాలి స్కంద బాలీవుడ్ సినిమా కాదు! తెలుగు సినిమా. మేము తెలుగులో తీసాం. హిందీ ప్రేక్షకులు నామీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మేం థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమాలు తీస్తాం. యూట్యూబ్, మొబైల్ లో కాకుండా హిందీ ప్రేక్షకులకు కూడా ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని 'స్కంద' ని ప్రపంచం మొత్తంగా విడుదల చేస్తున్నాం" అని రామ్ అన్నాడు. మీరు ఇటీవల షారుక్ ఖాన్ గారిని కలిసారని విన్నా? షారుక్ ని కలిసినప్పుడు ఎలా అనిపించింది? అని అడిగితే.." అట్లీ, ప్రియ ఇద్దరు నా ఫ్రెండ్స్.

 నన్ను షారుక్ ఖాన్ ని పరిచయం చేసింది వాళ్లే. నేను షారుక్ సార్ ని కలిసిన దగ్గర నుంచి ఆయన నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. స్కంద ట్రైలర్ పంపమని షారుఖ్ సార్ అడిగారు. ఆయన చాలా మంచి వ్యక్తి" అని అన్నాడు రామ్. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ని కూడా తాను కలిశానని రామ్ ఈ సందర్భంగా వెల్లడించారు." నేను కలిసిన తొలి హిందీ హీరో సల్మాన్ ఖాన్. నిజానికి నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. రెడీ మూవీలో జెనీలియాతో కలిసి నటించా. భాయ్(సల్మాన్ ఖాన్) వస్తున్నారు అని రితేష్ అన్నారు. అప్పుడు నేను వెళ్తానని చెప్పా. దానికి రితేష్ ఒప్పుకోలేదు, నన్ను పట్టుకుని ఆపాడు. రెడీ మూవీని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు. ఆయనకు నన్ను పరిచయం చేసాక 'గుర్తున్నావు, రెడీలో బాగా చేశావు' అని అన్నారు. మా స్రవంతి మూవీ సంస్థలో నేను చేసిన మొదటి సినిమా రెడీ. అది సల్మాన్ ఖాన్ గారు రీమేక్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది" అంటూ రామ్ పోతినేని చెప్పుకొచ్చాడు


మరింత సమాచారం తెలుసుకోండి: