రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో శ్రీ లీల , రామ్ సరసన హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. శ్రీకాంత్ , ప్రిన్స్మూవీ లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాని కొంత కాలం క్రితం సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు.

అలాగే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక ఆ ఈవెంట్ లో భాగంగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన కాకుండా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక పోతే ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసి చాలా కాలం కావడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ ను విడుదల చేసారు.

ఇకపోతే ఈ ట్రైలర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంది. దానితో ఈ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన కేవలం 11 సమయం లోనే యూట్యూబ్ లో 6.9 మిలియన్ వ్యూస్ ను , 109 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: