పూజ హెగ్డే  రష్మిక ల స్థాయిని మించిన మ్యానియా ఇప్పుడు ఇండస్ట్రీలో శ్రీలీల కు కొనసాగుతున్న పరిస్థితులలో మీడియం రేంజ్ హీరోల నుండి టాప్ హీరోల వరకు చాలామంది తమ సినిమాలలో హీరోయిన్ గా శ్రీలీలను కోరుకుంటున్నారు. ఆమె కూడ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజూ ఏదోఒక మూవీ షూటింగ్ స్పాట్ లో ఆమె హడావిడి చేస్తోంది.


ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న ఈమె యంగ్ హీరో రామ్ తో కలిసి నటించిన ‘స్కంద’ మూవీ ఈవారం విడుదల కాబోతోంది. ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ శ్రీలీల పెట్టబోతున్న లీవ్ పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు. నవంబర్ నెలాఖరు నుండి శ్రీలీల తన ఎమ్ బి బిఎస్ చదువుల నిమిత్తం సుమారు నెలరోజులకు పైగా షూటింగ్ లకు లీవ్ పెడుతున్న విషయం పై సెటైర్స్ వేశాడు.


ఇండస్ట్రీలో నిర్మాణం జరుపుకుంటున్న అనేక భారీ సినిమాలలో శ్రీలీల నటిస్తున్న సందర్భంలో ఆమె తన చదువు కోసం లీవ్ పెడితే ఇండస్ట్రీ షూటింగ్ లకు కూడ సెలవులు ప్రకటించడం మంచిదని హీరోలకు కూడ రెస్ట్ దొరుకుతుంది కదా అంటూ జోక్ చేశాడు. వాస్తవానికి రామ్ అన్నమాటలలో జోక్ ఉన్నప్పటికీ శ్రీలీల లీవ్ వల్ల అనేక సినిమాల షూటింగ్ లు ఎలా ఆగిపోతాయో ఆన్న విషయాన్ని రామ్ వివరించాడు అనుకోవాలి.


ఈ వారం విడుదల అవుతున్న ‘స్కంద’ తరువాత అక్టోబర్ లో ‘భగవత్ కేసరి’ నంబర్ లో ‘ఆడికేశవ’ డిసెంబర్ లో ‘ఎక్స్ ట్రాడినరీ మ్యాన్’ జనవరిలో ‘గుంటూరు కారం’ ఇలా వరసగా ప్రతినెలా ఒక సినిమా శ్రీలీల నటించింది విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ సినిమాలలో ఏరెండు సినిమాలు హిట్ అయినా శ్రీలీల మ్యానియా మరింత పెరిగిపోయి ఆమెకు 5 కోట్ల పారితోషికం ఇచ్చే పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యం లేదు అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: