హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో కంగనా రనౌత్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని చాలా సంవత్సరాలుగా హిందీ సినీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీయేస్ట్ బ్యూటీ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ లో కొన్ని సౌత్ సినిమాలలో కూడా నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటి రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి 2 అనే తమిళ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది.

మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే కంగనా ... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఏక్ నిరంజన్ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ ... పూరి సార్ నన్ను తెలుగు సినీ పరిశ్రమలోకి పోకిరి సినిమా తోనే లాంచ్ చేద్దాం అని అనుకున్నారు ... కానీ ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ మూవీ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. అలా పోకిరి మూవీ ని మిస్ చేసుకున్నాను. ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అని తాజాగా కంగానా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: