విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడు దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ దర్శకుడికి సూపర్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రిలో లభించింది. ఇక ఆ తర్వాత ఇదే సినిమాను హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా కిబిర్ సింగ్ పేరుతో సందీప్ రీమేక్ చేశాడు.

ఇకపోతే ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ విజయం అందుకుంది. ఇలా ఈ మూవీ రీమేక్ హిందీ లో అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో ఈ మూవీ తో ఈ దర్శకుడి పేరు ఇండియా వ్యాప్తంగా మారుమయింది. ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న యానిమల్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఇప్పటికే ఈ టీజర్ కు సంబంధించిన పనులు అన్ని కూడా ఈ మూవీ మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ టీజర్ కు యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ టీజర్ ను 2 నిమిషాల 29 సెకండ్ల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ టీజర్ ను ఇప్పటికే కొంత మంది చూడగా వారు ఈ టీజర్ పై ప్రశంసల వర్షం కురిపించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: