మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. ఇక ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో రవితేజ కూడా బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించి న అప్డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే తాజాగా చిత్ర బృందం వారు విడుదల చేసిన పోస్టర్ లో రవితేజ అదిరి పోయే స్టైలిష్ లుక్ లో నోట్లో సిగరెట్ పెట్టుకొని ఉన్నాడు.

ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి సారి పాన్ ఇండియా మూవీ గా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై రవితేజ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ లెవెల్లో అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: