
ఇక మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడుతున్న రామ్.. స్కంద కోసం భారీగా హోమ్ వర్క్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామ్ తెగ కష్టపడ్డాడని ఆయన ట్రాన్స్‌ఫర్‌మేషన్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం రామ్ తన లుక్‌తో పాటు బాడీకి కూడా బాగానే పని చెప్పాడట. ఎంతలా అంటే క్యారెక్టర్ కోసం 12కిలోల బరువు పెరిగాడట. బాడీ షేప్ పర్‌ఫెక్ట్‌గా రావడానికి జిమ్‌లో భారీగా కసరత్తులు చేశాడట. ఇక రామ్ లుక్ కు సబంధించిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు బాగా రెస్పాన్స్ సాధించాయి. అంతే కాదు ఈ సినమిాకు బిజినెస్ కూడా భారీగా జరిగిందట. మరి రామ్ కష్టానికి ఈసినిమాతో మంచి ఫలితం లభిస్తుందా లేదా చూడాలి.