ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ లో వరస మూవీ లతో కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న హీరోలలో యువ నటుడు కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన పోయిన సంవత్సరం సెబాస్టియర్ , సమ్మతమే , నేను మీకు బాగా కావలసిన వాడిని అని మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో సమ్మతమే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకోగా ... మిగతా రెండు సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే ఇప్పటికే ఈ నటుడు సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ , మీటర్ అనే మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా మంచి విజయం సాధించగా ... మీటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కిరణ్ ఈ సంవత్సరం మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

అదే రూల్స్ రంజన్. ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 30 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ హాల్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రత్నం కృష్ణమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ మూవీ తో ఈ యువ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: