దర్శకుడు పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పేరు అంటే ఎప్పటికీ ఒక బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో కూడా కోరుకుంటారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో మొదటి హిట్ అందుకున్న పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు.కాకపోతే ఇటీవల పూరి స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టడం లేదు అనే వార్త గట్టిగా వినిపిస్తుంది.ఇటీవల దర్శకుడు పూరిజగన్నాధ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో లైగర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ కెరీర్ ఎలా మారుతుంది అనే చర్చ ఎక్కువగానే జరిగింది. . కానీ ఎలాగోలా పూరి.. ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ సినిమా ను సెట్ చేసుకున్నారు.ప్రస్తుతం పూరి జగన్నాధ్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా నేడు పూరి జగన్నాధ్ తన 57వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. పూరి బర్త్ డే కావడంతో షూటింగ్ లొకేషన్ లోనే చిత్ర యూనిట్ సెలబ్రేషన్ నిర్వహించారు.

ఇక్కడ మరో కఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పూరి జగన్నాధ్ ప్రొడక్షన్ పార్ట్నర్ అయిన నటి ఛార్మి అర్థరాత్రి బర్త్ డే విషెస్ చెబుతూ ఒక పోస్ట్ పెట్టింది. పూరి కేక్ కట్ చేస్తున్న పిక్స్ కూడా ఆమె షేర్ చేసింది. దీనితో ఈ పిక్స్ బాగా వైరల్ గా మారాయి. హ్యాపీ బర్త్ డే పూరి సర్ అని రాసి ఉన్న కేక్స్ ముందు పూరి ఉన్న ఫోటోలని ఛార్మి షేర్ చేసింది.ఇవి శాశ్వతమైన సెలెబ్రేషన్స్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఇదిలా ఉండగా పూరి జగన్నాద్ మరియు నటి ఛార్మి గురించి ఎన్నో రూమర్స్ ఇటీవల బాగా వినిపిస్తూనే ఉన్నాయి. వారిద్దరూ ప్రొఫెషనల్ గా అయితే పార్ట్నర్స్ గా కోనసాగుతున్నారు. అదే సమయంలో పర్సనల్ లైఫ్ గురించి కూడా రూమర్స్ వస్తున్నాయి.ఆ మధ్యన బండ్ల గణేష్ ఆకాష్ పూరి నటించిన ఒక చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వద్ద చేసిన కామెంట్స్ ఎంతలా సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిందే. కొన్ని సార్లు ఛార్మి తీవ్రంగా ట్రోలింగ్ కు గురైంది.అయినా కూడా వీరిద్దరూ కలసి సినిమాలు నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు.. తన గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా పూరి వాటిని పట్టించుకోడు.. తన పని తాను చేసుకుంటూ వెళతారు.ప్రస్తుతం పూరి భారీ హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: