ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో అనేక క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవి ఏవి ఏ తేదీల్లో విడుదల కాబోతున్నాయి ..? అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో మొదటగా యానిమల్ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటించగా ... రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ధనుష్ హీరోగా రూపొందిన కెప్టెన్ మిల్లర్ సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ మూవీ లో సందీప్ కిషన్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ ఇరానీ దర్శకత్వంలో రూపొందిన డంకి మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే షారుక్ నటించిన పటాన్ , జవాన్ మూవీ లు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇలా ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో 4 క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో ఏ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: