తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి అఖిల్ గురించి ప్రత్యేకంగా సింక్ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తన కెరియర్ లో చాలా సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. తాజాగా ఈ యువ నటుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు.

సాక్షా వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని అనిల్ సుంకర నిర్మించాడు. మమ్ముట్టిమూవీ లో ఓ కిలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాలు నడుము విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకోలేదు. ఇకపోతే ఈ మూవీ తర్వాత అఖిల్ అనేక కథలను వింటున్నప్పటికీ ఏ సినిమాను కూడా ఓకే చేయలేదు. ఇకపోతే తాజాగా ఓ తమిళ దర్శకుడు చెప్పిన కథకు అఖిల్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో లింగుసామి ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా రామ్ పోతినేని హీరోగా రూపొందిన ది వారియర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా అయ్యింది. ఇక ది వారియర్ మూవీ ఫ్లాప్ తర్వాత ఈ దర్శకుడు అఖిల్ కి తాజాగా ఓ కథను వినిపించగా ఆ కథ అఖిల్ కు అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ దర్శకుడి సినిమాలో నటించడానికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: