
ఈ క్రమంలోనే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. అయితే ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్ బయటికి వచ్చిన అది సెన్సేషన్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక క్రేజీ రూమర్ సినీ ప్రియులందరికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు కేజీఎఫ్ ఫేమ్ యష్ కూడా కనిపించబోతున్నాడట. సినిమా క్లైమాక్స్ లో హీరో యష్ తో పాటు ఎన్టీఆర్ సర్ప్రైజ్ చేయబోతున్నారు అన్న ఒక వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారిపోయింది.
అయితే ఇప్పటికే యష్ తో కేజిఎఫ్ సినిమా చేశాడు ప్రశాంత్ నీల్. ఇక సలార్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు హీరోలను క్లైమాక్స్ లో లింక్ చేసి మరో కొత్త సినిమాను ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అయితే యష్ తో కేజిఎఫ్ త్రీ కూడా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. దీంతో ఇక ఇలా ప్రభాస్ సలార్ సినిమాలో క్లైమాక్స్ లో ఎన్టీఆర్, యష్ కనిపించబోతున్నారు అనే వార్తలు రూమర్లు అంటూ కొట్టి పారేయలేమని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.